telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్-కోర్టుకు .. మధ్యలో అప్పడలైపోతున్న అధికారులు..

high court on new building in telangana

మరోసారి అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అభ్యంతరం, అసహనం వ్యక్తం చేసింది. అఖిలభారత సత్ర్వీసుల నుండి వచ్చిన ఐఏఎస్ స్థాయి అధికారులు ఎంత నిర్మాణాత్మకంగా ఉండాలో, అలా జరగక ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన 15 ఏళ్ల సర్వీస్‌ లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. తన జీవిత కాలంలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ విరుచుకు పడ్డారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి గణాంకాలు వ్యూహాత్మక పదజాలం వాడారని హైకోర్టు పేర్కొంది. రవాణా శాఖా మంత్రికి ఆర్టీసీ ఇన్-చార్జ్ ఎండీ సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని, ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని దగా చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు గణాంకాలు అందజేశారని, ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు అందజేసి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తప్పు దోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌ చార్జి ఎండీని రావాణాశాఖ మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో? అర్థం కావడం లేదంటూ మండిపడింది.

జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో రీతిన తమకు తోచిన విధంగా గణాకాల గీతం పాడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని, అసలు హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా! అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే, ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఐదే ఐదు నిమిషాలు తన స్ధానంలో ఉండి చూడాలని, మీ నివేదికలు మీరు చెప్పే మాటలు అసలు నమ్మే విధంగా ఉన్నాయా? అంటూ అధికారులపై చీఫ్ జస్టిస్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం, కార్మిక సంఘాలవల్ల గత నెల రోజులకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం ₹ 47 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ₹ 47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు అంత ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది.

Related posts