ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై వేదికగా అయితే పంజాబ్ కింగ్స్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చారు పంజాబ్ బౌలర్లు. అయితే 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఆదుకున్నాడు. కానీ చివర్లో పంజాబ్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(25) పెవిలియన్ కు చేరుకున్న గేల్ తో కలిసి బ్యాటింగ్ కొసాగించిన కెప్టెన్ రాహుల్ రాణించడంతో మరో వికెట్ పడకుండా జట్టుకు 17.4 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో ఈ ఐపీఎల్ లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కు ఈ విజయం ఊరటను ఇచ్చింది.
previous post