telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైటెక్ సిటీ వచ్చిన తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి: చంద్రబాబు

chandrababu campaign in karnataka

హైకోర్టు, అసెంబ్లీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.హైదరాబాదులో ఇవన్నీ తరతరాల నుంచి ఉన్నప్పటికీ హైటెక్ సిటీ వచ్చిన తర్వాతే హైదరాబాదు అభివృద్ధి జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు రైతులు నిర్వహిస్తున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతులు ఇచ్చిన భూమిలో రాజధాని అవసరాలు పోను 10 వేల ఎకరాలు మిగులుతుందని వెల్లడించారు.

ప్రభుత్వ నిధులతో పనిలేకుండా రాజధాని నిర్మించేలా ఆరోజు ప్రణాళికలు రచించామని చంద్రబాబు వివరించారు. అలాంటి ప్రజా రాజధాని అమరావతి అని, దీన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కేవలం పరిపాలన వల్లే అభివృద్ధి జరగదని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఒక సైబర్ సిటీ, ఒక అవుటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత హైద్రాబాద్ అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు.

Related posts