తుగ్లక్ పరిపాలన అంటే వైసీపీ నేతలు గుంజుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ పరిపాలనకు తుగ్లక్ పరిపాలనకు దగ్గరి పోలికలు ఉన్నాయని దుయ్యబట్టారు. సన్న బియ్యం ఇస్తామని చెప్పి, తర్వాత నాణ్యమైన బియ్యమని మాట మార్చి, చెక్క బియ్యం పంపిణీ చేయటం తుగ్లక్ చర్య కాదా? అని ప్రశ్నించారు. రూ.5కే భోజనం పెట్టే అన్నా కాంటీన్లు మూసివేయడం తుగ్లక్ పరిపాలన కాదా? అని అన్నారు.
మహ్మద్ బీన్ తుగ్లక్‌కు ఎవరి సమస్యలు తెలిసేవి కాదన్నారు. రైతు ఆత్మహత్యలపై, వారి సమస్యలపైనా ఇంత వరకు జగన్ స్పందించకపోవటం తుగ్లక్ పాలనకు నిదర్శనమన్నారు. రాజధాని కాసేపు దౌలతాబాద్, కాసేపు ఢిల్లీ అని తుగ్లక్ పాలించారన్నారు. జగన్ ప్రభుత్వం కూడా అలాగే రాజధాని పై గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఆమె అన్నారు.