telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మరో వైరస్ దాడికి సిద్దమవుతున చైనా..!

CQVI Virus

కరోనా వైరస్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనా మరో వైరస్ తో దాడికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దాడికి సిద్ధంగా ఉందని పేర్కొంది. క్యూలెక్స్ దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది.

భారత్‌లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏజిప్టీతోపాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైరస్ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 883 సీరం నమూనాలను సేకరించి వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించారు. ఈ సందర్భంగా రెండు నమూనాల్లో క్యాట్ క్యూ వైరస్‌ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం ఎంతమందిలో ఉన్నదీ తెలియాలంటే మరిన్ని నమూనాలను పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related posts