telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాజ్ తరుణ లిప్ లాగ్ పోస్టర్ విడుదల…

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. ఈ యువ హీరో తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కానీ గత కొంత కాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న సమయంలో విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను గత నెల 14న ప్రకటించారు. పవర్ ప్లే అనే పేరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందా లేదా అనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. అలాగే ఈ రోజు ప్రేమికుల రోజు సందర్బంగా చాలా సినిమాలు పాటలను విడుదల చేస్తున్నాయి. కానీ ఈ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్ లిప్ లాగ్ పెట్టుకుంటున్నారు. అయితే దర్శకుడు విజయ్ ‘పవర్ ప్లే’ సినిమా కన్నా ముందు కన్నడలో ‘రైడర్’ అనే సినిమా చేస్తున్నాడు. మరి పవర్ ప్లే సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనేది తెలీదు. కానీ సినిమా షూటింగ్ ను శరవేగంతో చేస్తున్నారు. మరి ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాణిస్తుందేమో వేచి చూడాలి.

Related posts