బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్‌లోనే ఉన్నాయి. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారిప్పుడు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.ఈ చిత్రం హీరోయిన్ విషయమై తీవ్రంగా ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఈ విషయం పై ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా సీత పేరు వెల్లడించిన ప్రభాస్. సీత పాత్రకు కృతి సనన్ ను ఎంపికచేసినట్లు… ఆమెకు వెల్‌కమ్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే కృతి సనన్ బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆ కారణంగానే ఈమెను ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకు తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
previous post
next post