telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సఫారీకి వెళ్లిన టూరిస్టులకు వెన్నులో వణుకు… ఏనుగు ఏం చేసిందంటే ?

Elephant

వైల్డ్‌లైఫ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆఫ్రికానే. ప్రపంచంలోని అనేక మంది టూరిస్ట్‌లు వివిధ జంతువులను చూడటానికి ఆఫ్రికా సఫారీకే వెళ్తుంటారు. అలాగే ఆఫ్రికా సఫారీని సందర్శించడానికి టూరిస్ట్‌లు ఓ జీపులో బయలుదేరగా.. మార్గమధ్యంలో వారి ప్రయాణానికి ఓ ఏనుగు అడ్డువచ్చింది. ఆ ఏనుగు మంచి కోపంతో ఉండడమే కాకుండా… జీపుకు ఎదరుగా ఆ ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుండటంతో జీపులో ఉన్న టూరిస్ట్‌లకు వెన్నులో వణుకు పుట్టింది. ఓ ఇద్దరు మాత్రం ఈ సన్నివేశాన్ని కూడా వీడియో తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే డ్రైవర్ జీపును రివర్స్ గేర్‌లో చాలా సేపు వెనక్కు ప్రయాణించి చాకచక్యంగా ఏనుగు నుంచి ప్రమాదాన్ని తప్పించాడు. జులై 13న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియోలో అప్‌లోడ్ చేయగా.. కొద్ది రోజుల్లోనే ఆ వీడియోను దాదాపు కోటి మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts