telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలు ఆపాలన్న కాంగ్రెస్‌ పిల్ పై హైకోర్టు ఆగ్రహం…

high court on new building in telangana

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజు శ్రవణ్ న్యాయవాది అభ్యర్థనతో అత్యవసర విచారణను ఇవాళ చేపట్టింది హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని శ్రవణ్ పిల్ దాఖలు చేయగా..రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని శ్రవణ్ పిల్‌ లో తన వాదనను వినిపించారు. విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరన్న శ్రవణ్ పిల్‌ లో పేర్కొన్నారు. అయితే.. పిల్ దాఖలు చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏంచేశారని హైకోర్టు వ్యాఖ్యానిచ్చింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించ లేదని హైకోర్టు వ్యాఖ్యానించగా…ఎన్నికల షెడ్యూలు ఇవ్వబోయే చివరి క్షణంలో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించింది. రాజకీయ దురుద్దేశంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారన్న హైకోర్టు… ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ పై విచారణ జరుపుతాం… కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది హైకోర్టు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులుజారీచేసింది హైకోర్టు. ఇదే అంశంపై 2015, 2016లో దాఖలైన పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

Related posts