నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా ప్రొటోకాల్ మీకు తెలుసా.. అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్న కోపంతో అర్ధరాత్రి రెచ్చిపోయారు.
సర్వే చేస్తున్నారన్న అనుమానంతో బెంగళూరుకు చెందిన కొందరు యువకులపై స్థానిక వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ కార్యకర్తలపై కేసునమోదైంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో వారిని విడుదల చేయాలని శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి పార్టీ కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు.
ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్