telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పండుగకు అదనపు బస్సులు..పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

rtc protest started with arrest

సంక్రాంతి పండుగకు ప్రాయాణీకుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ, దక్షిణమధ్య రైల్వే అన్నీ ఏర్పాట్లు చేశాయి. పండుగకు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్ళే ప్రాయాణీకుల సౌకర్యార్తం అదనపు బస్సులు, రైళ్ళను నడిపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యప్రాంతాలకు , మహారాష్ట్ర,కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్వీస్‌లతోపాటు అదనపు బస్సులు నడిపిస్తున్నారు.

పండుగ నిమిత్తం నడిపే అదనపు బస్సులు జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉం టాయి. అదనపు బస్సల కోసం అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. నగరంలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్లతోపాటు జంటనగరాలలోని శివారు ప్రాంతాలు, ముఖ్య కేంద్రాల నుంచి పండుగ వేళలో బస్సులను ఆపరేట్‌ చేసేందుకు నిర్ణయించారు. సీబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు, ఎల్బీనగర్‌, లింగంపల్లి, చందానగర్‌, ఈసీఐయల్‌, కేబీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, టెలిఫోన్‌భవన్‌ ప్రాంతాలతోపాటు ఆధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

Related posts