telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నగరంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి: హోం మంత్రి

Mahmood ali trs

హైదరాబాద్‌ పోలీసులు బాగా పనిచేస్తున్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘స్త్రీ’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయని చెప్పారు. మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ షీటీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖకు ప్రత్యేక సహకారం అందిస్తున్నదని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ చెప్పారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, భరోసా సెంటర్లతో రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. మహిళలు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులన్నా డయల్‌ 100కు సమాచారం అందించాలని తెలిపారు.

Related posts