telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఓటేసినందుకు పొట్టకొడుతున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనచైతన్య యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటేసినందుకు పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. తాము తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. పేదవాడు బతకడానికి వీలు లేకుండా కంపెనీలను తరిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉంటే పెన్షన్లు పెరిగేవన్నారు.

ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో పనులు జరిపామని, ఆ ఘనత తనదేనని తెలిపారు. అయితే, కాల్వలన్నీ పూర్తి చేసినా, కాంట్రాక్టర్లు సరిగా పనిచేయలేదని ఆరోపించారు. మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తయ్యేదని అన్నారు.’నా మీద ఏదో తవ్వి చివరికి ఎలుక తోక కూడా పట్టుకోలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

Related posts