లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా చిత్రాలు ఓటీటీల బాట పడుతున్నాయి. తాజాగా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” అనే చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మలయాళంలో విజయం సాధించిన ‘మహేశింతే ప్రతీకారమ్’ చిత్రం తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ అయింది. సత్యదేవ్ కథానాయకుడు. వెంకటేష్ మహా (‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్) దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటీవల టీజర్‌ను విడుదల చేయగా, గ్రామీణ నేపథ్య కథాంశంతో టీజర్ ఆకట్టుకునేలా సాగింది. ‘ఓ గ్రామీణ ఫొటోగ్రాఫర్ ప్రతీకార కథ ఇది. అరకులోయలో 36రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశారు. తెలుగు నేటివిటీకి తగినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాగా, కీర్తి సురేష్ నటించిన బైలింగ్యువల్ చిత్రం పెంగ్విన్ జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
previous post
“అర్జున్ రెడ్డి” అంటే సిగ్గుపడాలి : విజయ్ దేవరకొండ