రైతుల “ఢిల్లీ చలో” ఉద్రిక్తంగా మారింది. హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో “ఢిల్లీ చలో” ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఢిల్లీ దారులన్నింటినీ మూసివేసి, పెద్ద సంఖ్యలో సాయుధబలగాల మొహరించారు. రోడ్డు కు అడ్డంగా ఇసుకతో నింపిన ట్రాక్టర్ ట్రక్కులు, ముళ్ల తీగలు చుట్టిన సిమెంటు దిమ్మెల ను ఏర్పాటు చేసారు పోలీసులు. ప్రధాన రహదారులే గాకుండా, పక్కన ఉన్న మట్టి రోడ్లను కూడా గుంతలు తవ్వి, ఆ మట్టినే అడ్డంగా కుప్పగా పోశారు. రెండు నెలలకు సరిపడా, ఆహారాన్ని, నీరు, ఆహారధాన్యాలను సమకూర్చుకుని ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్నారు రైతులు. ఢిల్లీ కి వస్తున్నవారిలో ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ చెందిన రైతులు ఉన్నారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులపై భాష్పవాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు. ఏడు రైతు సంఘాలతో కూడిన “సంయుక్త కిసాన్ మోర్చా” ప్రధానికి లేఖ రాసింది. చర్చలకు స్థలం, సమయం కేటాయుంచాలని లేఖలో తెలిపింది.
previous post
next post