telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోకు భార్య చేతి వంట తెచ్చిన తంటా

Chris

ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ ప్రాట్‌ సరదాగా పెట్టిన పోస్ట్ బ్యాక్‌ఫైర్ అయ్యి తిరిగి ఆయనకే తగిలింది. అసలేం జరిగిందంటే… క్రిస్ ప్రాట్ కోసం అతని భార్య కేథరీన్ ష్వార్జ్‌నెగ్గర్ వంట చేసి పెట్టింది. అయితే అది కాస్తా మాడిపోయింది. మాడిపోయిన ఆ వంటకాన్ని క్రిస్ ఫొటో తీశాడు. అంతటితో ఆగకుండా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన భార్యకు వంట రాదంటూ పరోక్షంగా కామెంట్లు చేశాడు. “నాకు వంట చేసి పెట్టినందుకు నా డార్లింగ్‌కు ధన్యవాదాలు. కానీ ఈ వంటకం సరిగ్గా రాలేదు. మాడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. నేను ఓవెన్‌లో రెండు నిమిషాల పాటు ఉంచి వేడి చేయమన్నాను. కానీ నా భార్యకు రెండు గంటలు అని అర్థమైనట్లుంది. కానీ తను ఈ వంటకాన్ని ప్రయత్నించినందుకు అభినందిస్తున్నాను. తనని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నాడు. తన భార్య వంట చేసినందుకు మెచ్చుకుంటూనే మరోపక్క మాడిపోయిన వంట గురించి కామెంట్స్ చేశాడు. ఈ ఫొటోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా లైక్ చేశాడు. అయితే కొందరు నెటిజన్లకు మాత్రం క్రిస్ ప్రవర్తన నచ్చలేదు. ఎందుకంటే కేథరీన్ ఓ రచయిత్రి. అలాంటిది ఆమె ఓ ఇల్లాలిగా భర్తకు వండిపెడుతుంటే అభినందించాల్సిందిపోయి సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు క్రిస్‌కు క్లాస్ పీకుతున్నారు. మరి కొంతమంది మాత్రం భార్యతో సరదాగా ఇలా చేస్తే తప్పేముంది ? అంటున్నారు.

Related posts