telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా సోకిన విద్యార్థులకు మంత్రి ఆళ్ల నాని పరామర్శ…

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ… తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా సోకిన 57 మంది విద్యార్థులు.. వారి కుటుంబాలకు ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య.. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మంత్రి ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. కరోనా సోకిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. వేద పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉంటున్నారని ఆళ్ల నాని పేర్కొన్నారు. వేద పాఠశాలలో శిక్షణకు వచ్చిన విద్యార్థులు అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ తో పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అయ్యారు. అయితే అదే విద్యార్థులకు రాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా సోకిన 57 మంది విద్యార్థులను తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ చికిత్స కోసం తరలించామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 57 మంది విద్యార్థులు స్విమ్స్ హాస్పిటల్ లో ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసి క్వారంటైన్ లో ఉంచామని ఆయన అన్నారు. కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అన్నారు.

Related posts