telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో కరోనా మళ్లీ మహోగ్రరూపం.. 24 గంటల్లో 55 వేల కేసులు!

Corona

అమెరికాలో మళ్లీ కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొన్నటి వరకు అగరరాజ్యాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టింది. , తాజాగా మళ్లీ ఇప్పుడు విజృంభించడంతో గత 24 గంటల్లో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

ఇక, దేశంలోని 50 రాష్ట్రాల్లో 40 రాష్ట్రాలలో కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయి. తాజాగా నమోదైన 55 వేల కేసుల్లో 25 వేలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.10 కోట్ల మంది కరోనా బాధితులుగా మారగా, ఇప్పటి వరకు 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

తొలి నుంచీ కరోనాను తేలిగ్గా తీసుకున్న బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32,107 మంది కరోనా బారినపడ్డారు. 990 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలకు చేరుకుంది. రష్యాలో 6,718, పాకిస్థాన్‌లో 4,193, దక్షిణాఫ్రికాలో 8,728 మందికి కొత్తగా వైరస్ సోకింది.

Related posts