telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇండియన్-2″లో బోల్డ్ హీరోయిన్ ?

Payal

క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్‌ల క్రేజీ కాంబినేష‌న్లో దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న చిత్రం “భార‌తీయుడు-2”. 1996లో వ‌చ్చి సంచ‌ల‌నం రేపిన “భార‌తీయుడు” చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల చ‌ర్చ‌ల త‌ర్వాత సినిమాను మొద‌లుపెడితే…క‌మ‌ల్‌కు మేక‌ప్ ప‌డ‌క ఒక‌సారి.. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ మ‌ధ్య విభేదాల వ‌ల్ల మ‌రోసారి.. క‌మ‌ల్ పొలిటిక‌ల్ క‌మిట్మెంట్ల వ‌ల్ల మ‌రోసారి.. సెట్లో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదం వ‌ల్ల ఇంకోసారి షూటింగుకి బ్రేక్ ప‌డింది. ఇప్పుడు కరోనా సంక్షోభం ఎలానూ ఉండ‌నే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తో యూత్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్స్‌ కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శంక‌ర్ మ‌రింత గ్లామ‌ర్ యాడ్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.

Related posts