telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అక్కడ ఆదివారం నాన్ వెజ్ మార్కెట్ల నిషేధం..

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పైగా కేసులు 100 కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. దాంతో ఇప్పుడు మాములు పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించింది. నిత్యం రద్దీగా ఉండే నాన్ వెజ్ మార్కెట్లు బోసిపోయాయి. విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు. అయితే ఈ నిర్ణయం కఠినమైనది అని అంటున్నారు.

Related posts