telugu navyamedia
రాజకీయ వార్తలు

మా నాన్న పై విషప్రయోగం.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి: నవాజ్ షరీఫ్ కుమారుడు డిమాండ్

Nawaz sharif

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. విషప్రయోగం వల్లే మా నాన్న ఆరోగ్యం దెబ్బతిందని చెప్పారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషప్రయోగం జరగడం వల్ల ఆయన ప్లేట్ లెట్ల సంఖ్య 16,000కు పడిపోయిందని తెలిపారు. తన తండ్రి ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారని వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ఆయనను సరైన సమయంలో ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వివిధ కేసుల్లో దోషిగా తేలిన షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను లాహోర్ లోని ‘ది సర్వీస్’ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రినే జైలుగా మార్చేశారు. మరోవైపు, షరీఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చితకిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

Related posts