telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గిరిజనుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

pushpa sreevani

గిరిజనుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేసిందని అన్నారు. గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి బాక్సైట్ తవ్వకాలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనుల సంపదను చంద్రబాబు దోచుకోవాలని చూశారని, బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. 2015లో చంద్రబాబు ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరాడారని, అప్పుడే బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.

Related posts