telugu navyamedia
రాజకీయ

రెబెల్ ఎమ్మెల్యేలు కోరితే ఇప్పుడే రాజీనామా చేస్తా..ట్విట్ట‌ర్ ట్రోలింగ్‌కు నేను స్పందించ‌ను..

*శివ‌సేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదు

*శివ‌సేన‌ని మోసం చేయ‌న‌ని చేప్తూ చేస్తుందేంటి అని ప్ర‌శ్నించారు.?
*సూర‌త్ వెళ్ళి ఎందుకు మాట్లాడాలి? ఇక్క‌డే నాతో మాట్లాడ‌వ‌చ్చు క‌దా?
*ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం లేద‌ని ఆస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు..
*రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకున్నా..
*ఉద్ధ‌వ్ సీఎంగా వ‌ద్దూ అని ఏ ఒక్క‌రు చెప్పినా ఇప్పుడే రాజీనామా చేస్తా..
* ట్విట్ట‌ర్ ట్రోలింగ్‌కు నేను స్పందించ‌ను..

ఉద్దవ్‌ సీఎంగా శివసేన ఎమ్మెల్యేలలో ఓ ఒక్కరైనా వద్దంటే ఇప్పుడే చేస్తాన‌ని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజీనామా లేఖను రెడీ చేయిస్తానని… గవర్నర్‌కు పంపించాలని చెప్తానన్నారు. ట్వీట్‌లు, ట్రోలింగ్స్‌ తాను స్పందించబోన‌ని అన్నారు. పదవులు వస్తాయి పోతాయని అన్నారు. వాటి కోసం తాము ఎప్పుడూ లెక్క చేయలేదన్నారు.

మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రసంగించారు… ఇవాళ నాకు కరోనా వచ్చినట్టు తేలింది.కరోనా ఉన్నప్పటికీ లక్షణాలు ఏమీ లేవు. సీఎం పదవిని నిజాయితీగా నిర్వహించాను.

హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్‌ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన.  టాప్‌ 5 సీఎంలలో నేను ఒకడిని అన్నారు. చెప్పేందుకు చాలా మాటలు ఉన్నాయి. 

హిందుత్వం గురించి చాలా మాట్లాడుతున్నారు. ప్రజలను కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు.  హిందుత్వం వదిలేసిందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. మాకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు అటుపోయారు.. ఇటుపోయారు అంటున్నారు. దానిపై నేనేమీ మాట్లాడను.

కాంగ్రెస్‌, ఎన్సీపీలతో ’30 ఏళ్లుగా పోరాటం చేశామ‌ని… కానీ శరద్‌పవార్‌.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా ..ఎన్సీపీ, కాంగ్రెస్‌ నాకు పూర్తి సహకారం అందించాయి. అందరం కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశామ‌ని అన్నారు.

 ఇప్పుడు కాంగ్రెస్‌, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.కమల్‌నాథ్ శరద్‌పవార్‌ మాట్లాడారు. ఇద్దరు శివసేన వెంట ఉంటామ‌ని చెప్పారన్నారు.

కాంగ్రెస్‌ ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. కమల్‌నాథ్ శరద్‌పవార్‌ మాట్లాడారు. ఇద్దరు శివసేన వెంట ఉంటామ‌ని చెప్పారన్నారు.

తమ పార్టీ వాళ్లే మోసం చేస్తారని అనుకోలేదన్నారు థాక్రే. వ్యతిరేకించేవాళ్లు సూరత్‌ వెళ్లి ఎందుకు మాట్లాడాలి… ఇక్కడే నాతో మాట్లాడవచ్చు కదా.. శివసేనను మోసం చేయనూ అని చెబుతూ ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు.

గుజరాత్​లో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు తమను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఫోన్ చేసి చెప్పారని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

Related posts