telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా రైల్‌రోకోలకు సిద్ధమైన రైతులు…

దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా, నిర్భందం తీవ్రతరం అవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు. ఇక, ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే.. కేంద్రం సరైన రీతిలో స్పందించకపోవడంతో.. ఆందోళన మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైల్‌రోకో‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటలు వరకు.. నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కాగా, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీకి చెందిన రైతులతో సహా వేలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళన 76వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇవాళ లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. వ్యవసాయ చట్టాల అమలు తప్పనిసరి కాదని వ్యాఖ్యానించారు.. అయితే, ప్రధాని ప్రసంగించిన కాసేపటికే తమ కార్యచరణను ప్రకటించాయి రైతు సంఘాలు. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది.

Related posts