telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ మంత్రివర్గంలో వీరికే బెర్తులు?

jagan attending guntur iftar tomorrow

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించేలా నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. . ఇందుకోసం విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులతో ఆయన తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో కొందరి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి పదవులు దక్కే అవకాశమున్న వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు (వెలమ – బీసీ), కంబాల జోగులు (ఎస్సీ), తమ్మినేని సీతారాం (కళింగ – బీసీ)లున్నారు. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు – బీసీ), కే వీరభద్రస్వామి (ఓసీ – వైశ్య) ఉండగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), విశ్వరూప్ (ఎస్సీ), దాడిశెట్టి రాజా (ఓసీ – కాపు), పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రసాదరాజు (ఓసీ రాజు), గ్రంధి శ్రీనివాస్ (ఓసీ – కాపు), కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని (ఓసీ – కమ్మ), పార్థసారధి (బీసీ – యాదవ), పేర్ని నాని (ఓసీ – కాపు), సామినేని ఉదయభాను (ఓసీ – కాపు) ఉన్నారు.

గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత (ఎస్సీ), మర్రి రాజశేఖర్ (ఓసీ – కమ్మ), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఓసీ – రెడ్డి), అంబటి రాంబాబు (ఓసీ – కాపు), ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఓసీ – రెడ్డి), ఆదిమూలపు సురేశ్ (ఎస్సీ), నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి (ఓసీ – రెడ్డి), అనిల్ కుమార్ యాదవ్ (బీసీ), కాకాని గోవర్ధన్ రెడ్డి (ఓసీ – రెడ్డి), చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ – రెడ్డి), రోజా (ఓసీ – రెడ్డి) పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఇక కడప జిల్లాకు వస్తే అంజాద్ బాషా (ముస్లిం) పేరు వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి (ఓసీ – రెడ్డి), శంకర్ నారాయణ (బీసీ – కురుమ), కాపు రామచంద్రారెడ్డి (బీసీ – వీరశైవ), కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ – రెడ్డి), శిల్పా చక్రపాణి రెడ్డి (ఓసీ – రెడ్డి)లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి.

Related posts