telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జానారెడ్డిపై సిఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఎన్నికలో ప్రచారం ఇవాళ్టి తో ముగియనుంది. ఈ నేపద్యంలో ఇవాళ సిఎం కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. నోముల లేని లోటు ఉందని.. నోముల స్థాయిలో పని చేస్తారని భగత్ కి టికెట్ ఇచ్చనని పేర్కొన్నారు. భగత్ కు గాలి బాగుందని.. ఈ గాలి 17 వరకు ఉండాలని పేర్కొన్నారు. భగత్ కి ఓట్లు ఎట్లా దుంకుతయో… నెల్లికల్లు నీళ్ళు కూడా అట్లా దుంకుతాయని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో తిరుమలగిరి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. బిక్షం ఎత్తి అయినా తీర్చుతానని హామీ ఇచ్చారు. జానారెడ్డి నేను ఇంత పొడుగు..అంతా పొడుగు అంటారని.. నందికొండ అటు గ్రామం కాదు… మున్సిపాలిటీ కాకుండా పోయిందని ఫైర్ అయ్యారు. కానీ తాము మున్సిపాలిటీ చేశామని..టీఆర్ఎస్ ను గెలిపిస్తే నందికొండ భూములకు పట్టాలు నేను వచ్చి ఇస్తానని సిఎం ప్రకటించారు. నందికొండలో డిగ్రీ కాలేజీ మంజూరు చేశామని..30 యేండ్లలో జానారెడ్డి.. ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకు రాలేదని ఫైర్ అయ్యారు. పార్టీల చరిత్ర కూడా చూడాలన్నారు. కెసిఆర్ కి సిఎం పదవి జానారెడ్డి పెట్టిన బిక్షా..? అని ప్రచారం చేస్తున్నారని..తన సీఎం పదవి తెలంగాణ ప్రజల బిక్ష అని స్పష్టం చేశారు. జానారెడ్డికి సీఎం పదవి వస్తె అమ్ముకునే టోడని… నాకెందుకు ఇస్తారని చురకలు అంటించారు సిఎం కెసిఆర్. కాంగ్రెస్ జెండా సక్కగా ఉంటే…టీఆర్ఎస్ జెండా ఎగిరేదా ? పదవులకోసం కాంగ్రెస్ తెలంగాణను వదిలేసిందని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పదవులు వదిలేసింది టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. 

Related posts