telugu navyamedia
రాజకీయ

చిత్తూరు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. . పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం అందజేయనున్నట్టుగా మోదీ చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు లోయలో పడిన ప్రమాద ఘటనలో… అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన 8 మంది మృతి చెందారు. మారుతి నగర్​కు చెందిన యువకుడి నిశ్చితార్థం కోసం… తిరుచానూరుకు ఓ ప్రైవేటు బస్సులో 52 మంది పైగా బయలుదేరారు.

కాగా అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ ఎం.బసిరెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్‌లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు

Related posts