telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిత్తూరు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై పలువురు ముఖ్యనేతల దిగ్భ్రాంతి.

చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం పై పలువురు ముఖ్య‌నేతలు విచారం వ్యక్తం చేశారు. ఏపీ  ముఖ్యమంత్రి జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబుతో పాటులోకేష్‌, అచ్చెనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారుఈ ఘటనపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదంపై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆనందంగా నిశ్చితార్థానికి వెళుతుండగా బస్సు లోయలో పడిపోయిన దుర్ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. పెళ్లింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాకరపేట ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందటం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. సంతోషంగా  వివాహం జరుగుతున్న కుటుంబంలో విషాదం నిండటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంతో పాటు భాదిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

Related posts