కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరిద్దరికి అనంతపురంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ తమ అభిమానులతో కలిసి నేరుగా తాడిపత్రికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ చేశారు. అక్రమ కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.