ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే మాకేనా.. అధికారులకు లేవా.. అంటే, ఉన్నాయి అంటున్నారు.. ఇక మీదట పోలీసులకు కూడా ఈ తరహా చెకింగ్ ఉంటుందట. తప్పతాగి విధినిర్వహణలో పాల్గొనడం, అలాగే వాహనాలు నడపటం చూస్తూనే ఉన్నాం. దానితో వారికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని తేల్చారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పోలీసులను చెకింగ్ కోసం ఆపితే “పోలీస్” అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది.
ట్రాఫిక్ వారు నిర్వహించే ఆల్కహాల్ టెస్టుకు పోలీసులు కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను, విధులు ముగించుకుని వెళ్లిపోతున్న పోలీసులకు కూడా నిర్వహించాలని నిర్నయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ఏ ప్రదేశంలో పోలీసులు తారసపడ్డా సాధారణ ప్రజానికానికి నిర్వహించినట్టే టెస్టులు నిర్వహించాలని పోలీసు ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేశారట!!