telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విమాన టికెట్ల డబ్బులు రిఫండ్ చేయాలి: కేంద్రం

Air India flight

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులను ఇవ్వలేమని ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేసింది. దీనికి బదులుగా ప్రయాణ తేదీలను పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం సీరియస్ అయింది. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణాలు చేయలేకపోయిన వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఎటువంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించకుండా పూర్తి మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని తెలిపింది.

గరిష్ఠంగా మూడు వారాల్లో డబ్బు వెనక్కు ఇవ్వాలని పౌర విమానయాన శాఖ ఓ సర్క్యులర్ లో ఎయిర్ లైన్స్ కంపెనీలను ఆదేశించింది. అయితే, ప్రయాణికులు మే 3 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన కేంద్రం, రిఫండ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించింది. ఎయిర్ లైన్స్ సంస్థలు విస్తారా, గో ఎయిర్ తదితరాలు, తాము రిఫండ్ ను చేయలేమని ప్రకటించిన తరువాత, సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts