telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం

ktr meeting

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం అవుతుందని…రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలన్న ఆలోచన కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఉప్పల్ నియోజకవర్గంలోని సుమారు 20 కాలనీల్లోని సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు కాలనీవాసులు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  నగరంలోని పలు కాలనీల్లో ఉన్న రెవెన్యూ మరియు భూ యాజమాన్య సమస్యలు పరిష్కరించి పేదలకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక కాలనీల్లో రెవెన్యూ మరియు భూ సంబంధిత సమస్యలను, ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. కెసిఆర్ నగర్ లాంటి కాలనీలను డి-నోటిఫికేషన్ చేయడం ద్వారా ఆయా కాలనీల్లోని ప్రజలందరికీ ఉపయుక్తం గా మారిందన్నారు. నగరాల్లోని ఇతర కాలనీలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ధరణి కార్యక్రమం ద్వారా నగరములో ఉన్న ప్రతి ఒక్క ఇంచ్ భూమికి సంబంధించిన వివరాలు వాటికనుగుణంగా యాజమాన్య హక్కులను పొందే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ధరణి ద్వారా భూ యాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుందని… ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు అవినీతి రహితంగా వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, మంచినీటి సరఫరా వంటి మొదలైన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నమని గుర్తుచేశారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఎక్కువగా ఇంకెవరికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంటుందన్నారు.

Related posts