telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కమాండర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్

gun fire

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ సందర్భంగా గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో జరిగిన కాల్పులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మొన్నటి ఘటన మరవకముందే మరోసారి అదే రాష్ట్రంలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ రోజు ఉదయం రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను ఓ కానిస్టేబుల్ కాల్చి చంపాడు.

ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ… కమాండర్ రామ్ ఖురేపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్ పేరు విక్రమ్ రాజ్వారే అని చెప్పారు. ఎన్నికల విధుల కోసం జార్ఖండ్ వెళ్లిన ఛత్తీస్ గఢ్ బలగాల బృందంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని వివరించారు. విక్రమ్ ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై అధికారులు ఆరా తీసుస్తున్నారు.

Related posts