telugu navyamedia
రాజకీయ వార్తలు

రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ

modi on telugu states separation

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యాణాలోని ఫతేహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పరుడైన రాబర్ట్ వాద్రాను వదిలేది లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. దోచుకున్న వారిని అవినీతిపరులను ఈ చౌకీదార్ వదిలిపెట్టడని హెచ్చరించారు. న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తాడని హెచ్చరించారు.

మోదీ వ్యాఖ్యల పై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తనను గత ఐదేళ్లుగా నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనను జైలుకు పంపుతామని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ దుయ్యబట్టారు.

Related posts