తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్లు వేసేందుకు నేడు ఆఖరి రోజు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. పోటీపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మొదటి ప్రాధాన్య ఓట్ల ప్రకారమే టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థులకు 19.6 ఓట్లు వస్తుండగా కాంగ్రెస్‌కు మాత్రం 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు రెండో ప్రాధాన్య ఓట్లు వేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ముందు బరిలో దిగి పరువు పోగొట్టుకోవడం ఎందుకనే భావనతో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో వేసిన కమిటీ కూడా బుధవారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి