కేసీఆర్ ప్రభుత్వం మరో సరి కొత్త పథకం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. మహిళలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను సర్కార్ త్వరలోనే పంపిణీ చేయనుంది. ఈ వాహనాల ద్వరా చేపలతో తయారు చేసిన వంటలను విక్రయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 150 సంచార చేపల విక్రయ వాహనాలను ఈ పథకం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ వాహనం ధర రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో మహిళలకు అందించనుంది. చేపలను, చేపల వంటకాలను కావాల్సిన వారి వద్దకు చేర్చడం, తద్వరా మహిళలకు ఉపాధి లభించేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.