telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు పోరాటంలో మరో కీలక పరిణామం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్‌లో దర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్‌ లేఖ కూడా రాశారు. అటు తెలంగాణ కీలక నేత, మంత్రి కేటీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవి కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు పలికారు. స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవడానికి అవసరమైతే… వైజాగ్‌ వచ్చి కేంద్రంతో పోరాడతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు చేస్తున్న పోరాటంలో మరో కీలక ఘట్టం ఆవిషృతమైంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికుల సమ్మె నోటిసులిచ్చారు. ఈ నెల 20 తర్వాత సమ్మెకు వెళతామని కార్మికుల నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. కాగా.. స్టీల్‌ ప్లాంట్‌ ను ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. 

Related posts