telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిన్న మమతా… నేడు మాయావతి… కాంగ్రెస్ కు హైటెన్షన్ …

Mayawati Welcomes Reservation To Upper Castes

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటుకు ఆపసోపాలు పడుతుంది. ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియని స్థితిలో ఈ కూటమి ఉండటంతో అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు.. ఆదిలోనే హంసపాదు మాదిరి.. అయిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు బహిరంగంగానే కాంగ్రెస్ కూటమిని వ్యతిరేకిస్తుండగా, కొన్ని పార్టీలు కలిసినట్టే కలిసి, మెలికలు పెడుతూండటం విశేషం.

దీనిలో భాగంగానే, గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని… కేసులను ఎత్తి వేయకపోతే, మద్దతుపై తాము పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఏ ఒక్క హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని… బీజేపీ మాదిరే కాంగ్రెస్ వ్యవహరించరాదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ అపవాదులను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని ఆమె చెప్పారు.

Related posts