నేడు అస్సాంలోని డిబ్రూగర్ జిల్లాలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని గ్రాహం బజార్‌లో తొలి పేలుడు సంభవించిందని, మరో పేలుడు గురుద్వారా వద్ద జరిగింది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న తరుణంలో అసోంను వరుస పేలుళ్లు చేటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగ మరింత అప్రమత్తమైంది. డిబ్రూగర్‌లోలో పేలుడు జరిగినట్టు సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలికి బలగాలు చేరుకున్నాయని, ఈ ఘటనలకు ఎవరు బాధ్యులనే విషయంపై దర్యాప్తు ప్రారంభించామని అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మెహంత్ తెలిపారు.
previous post