ఏపీలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. వడగాల్పుల ప్రమాదం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పని ఉంటే తప్ప.. బయటకు రావద్దని సూచించింది. రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు…చిత్తూరు జిల్లా సత్యవేడులో 44.12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 45 నుండి 47 డిగ్రీల సెంటీగ్రేడ్‌కుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు: గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు , చిత్తూరు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు. 43 నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, అనంతపురం, విశాఖ. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, చితూరు జిల్లాలలో 41 నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు.. ఇలా ఉన్నాయి. మరో రెండు రోజులు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
అనంతపురం: పెద్దవడుగూరు 36.48, గుంతకల్లు -36.44, యాడకి-36.33, పమిడి 36.3, కదిరి -36.21.
చిత్తూరు: గంగాదర్, నెల్లూరు 40.53, రేణిగుంట – 40.52, సత్యవేడు – 44.12, వరదయ్యపాలెం – 41.18, ఏర్పేడు – 40.47.
తూర్పు గోదావరి: కరప-42.9, రాయవరం 41.77, పామర్రు 41.33, మండపేట 41.31, కపిలేశ్వరపురం 41.29.
గుంటూరు: బాపట్ల 42.28, ఈపూర్- 42.14, నాదెండ్ల – 41.96, క్రోసూరు – 41.75, పెదకూరపాడు 41.66.
కడప: పుల్లంపేట – 40.01, రాజం పేట -38.73, ఓబులవారి పేట 38.43, చిట్వేలు -38.26, ఒంటిమిట్ట -38.21.
కృష్ణా: మువ్వా -41.96, నందిగాం -41.66, పమిడిముక్కల -41.25, పెదపారపూడి -41.21, తిరువూరు-40.97.
కర్నూలు: దోర్నిపాడు -37.98, సిర్వేల్ – 37.32, ఉయ్యాలవాడ – 38.48, శ్రీశైలం -3.47, చాగలమర్రి – 37.72.
నెల్లూరు: ముత్తుకూరు – 41.42, చితమూరు -41.22, కొడవలూరు 41.03, చిలకూరు -40.8, తోటపల్లి గూడూరు- 41.22.
ప్రకాశం : టంగుటూరు 43.14, కొత్తపట్నం -41.94, కారంచేడు-41.94, వేటపాలెం -41.93, త్రిపురాంతకం-41.61.
శ్రీకాకుళం : పొందూరు -39.31, రణస్థలం -38.52, శ్రీకాకుళం – 38.59, జి.సింగడం -38.64, సరుబుచ్చిలి – 39.15, హిర మండలం – 38.76, విశాఖపట్నం: కొటరట్ల – 39.8, కసింకోట-39.46, మూడుగుల -39.16, నర్సీపట్నం – 37.93, ఆనందపురం – 40.37, విశాఖపట్నం అర్బన్ – 38.78.
విజయనగరం : బోగాపురం 40.37, గార్ల -39.41, బొండపల్లి 39.09, వేపాడ – 38.9, విజయనగరం – 38.76, సాలూరు – 37.92.
పశ్చిమ గోదావరి : తణుకు -41.86, నిడదవోలు – 41.35, బీమడోలు -41.62, పెంటపాడు – 42.67, పెద్దపాడు 41.8, అత్తిలి -41.22, తాళ్లపూడి-41.1.