telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడు…

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్దిరాలేదని కొడాలి ఎద్దేవా చేశారు. మతాలు, కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే చంద్రబాబుకు అంత మంచిదని హెచ్చరించారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే..తగిన శాస్తి చేస్తామని తెలిపారు. సీఎం జగన్‌ ఎన్నడూ కులాలను, మతాలను అడ్డుపెట్టుకోరని, చంద్రబాబులా అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని చూడలేదంటూ చురకలు అంటించారు. నంద్యాల అబ్దుల్‌ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ..ప్రభుత్వంపై బురుద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడని ఫైర్‌ అయ్యారు కొడాలి నాని. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోలేని బాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు…జూమ్‌ యాప్‌ ద్వారా సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

Related posts