ఏపీ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపేసింది జగన్ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ఇవాళ నిలిచిపోనున్న వ్యాక్సిన్ ప్రక్రియ…టీకా కేంద్రాల్లో రద్దీ.. తోపులాటలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది సర్కార్. క్రమ పద్దతిలో టీకాలు వేసేలా ప్రణాళికలు…పోలింగ్ తరహాలో వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోనుంది జగన్ ప్రభుత్వం. ఓటర్ స్లిప్పుల తరహాలో ఇంటింటికి వ్యాక్సిన్ స్లిప్పులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. రూరల్ ప్రాంతాల్లోని వారికి ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా వ్యాక్సిన్ స్లిప్పుల పంపిణీకి యోచన చేస్తోంది. అర్బన్ ప్రాంతాల్లోని వారికి ఎస్సెమ్మెస్సుల ద్వారా సమాచారం అందించేలా ప్రణాళికలు చేస్తోంది సర్కార్. రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయ్యాకే.. మొదటి డోస్ వ్యాక్సిన్ వేయాలని అధికారులకు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎక్కడైనా మొదటి డోస్ వ్యాక్సిన్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం గుమికూడితే సంబంధిత అధికారులపై చర్యలకు నిర్ణయం తీసుకుంది సర్కార్.
previous post
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్