నేనొక చిన్న మనిషిని
ఎముకలున దేహాన్ని
బక్క చిక్కిన శరీరాన్ని
మనో ధైర్యమే నా బలం…
కనబడే నరాలు
కనపడని కండలు
ఉక్కు లాంటి సంకల్పం
జీవన యాత్రకు తోడుగా…
ఆకారం చిన్నదే
ఆలోచనలు అనంతం
నింగిలో పుట్టిన
ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని…
విత్తనమే నాకు ఆదర్శం
నేల చీల్చి బయటికొచ్చే
ఎందరికో ఆసరా ఇచ్చే
నా ఆశయం కూడా అలాంటిదే…
అశాశ్వతమైన దేహముతో
శాశ్వతమైన కీర్తి కోసం
నిత్యం తపిస్తూ తిరుగుతున్నా
ఎన్నాళ్ళు ఉంటుందో ఈ ప్రాణం..
ధనమును పెంచలేదు
అక్షరాలను నమ్ముకున్న
ఆది నుంచి అంతము వరకు
జ్ఞానామృత ఫలాన్ని అనుభవిస్తున్నా…
ఆసరా లేని జీవిని
బంధాలన్నీ ధనము తోనే
కలుస్తున్నాయి విడిపోతున్నాయి
లెక్కలు చూస్తూ బ్రతుకుతున్నా కాలం..
ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలి: చంద్రబాబు