telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మెట్రోలో కూడా .. నేతల ప్రచారం.. ప్రయాణికుల చెవిలో పోరు.. !

congress campaign in metro also

మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులను కూడా వదలకుండా.. చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీభవన్‌ ఎదురుగా ఉన్న మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కి మియాపూర్‌ వరకు ప్రయాణం చేశారు.

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ప్రయాణికులను కోరారు. మెట్రో ప్రయాణం ఎలాఉంది? నగరానికి మెట్రో తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ప్రయాణికులకు వివరించారు. జంటనగరాల్లో మెట్రోరైళ్లను పెంచి శంషాబాద్‌ వరకు పొడిగించే ప్రయత్నం చేస్తామన్నారు.

Related posts