telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

 ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పై సీఈసీకి ఫిర్యాదు

dasoju-sravan

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాని ఈరోజు ఆయన కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలపై ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

అర్ధరాత్రి షెడ్యూల్ ఇచ్చి తెల్లవారుజాము నుంచే నామినేషన్లు స్వీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. అన్ని విషయాలు పరిశీలిస్తామని సీఈసీ తమకు హామీ ఇచ్చినట్టు దాసోజ్ శ్రవణ్ తెలిపారు.

Related posts