telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో కోటి మందికి వ్యాక్సిన్‌ : విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

ఏపీ ప్రజలకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా ట్వీట్‌ చేశారు.  “డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం జగన్‌ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది. ” అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.76 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,76,336 కు చేరింది. ఇందులో 8,64,612 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7064 మంది మృతి చెందారు.

Related posts