telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

త్వరలో ఆచార్య షూటింగ్ లో చరణ్…

Ram-Charan

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ప్రస్తుతం చరన్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను ముగించుకున్న వెంటనే ఆచార్యతో కలవనున్నాడు. ఇటీవల నిహారిక పెళ్ళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి చెర్రీ కాస్త బ్రెక్ తీసుకున్నాడు. త్వరలోనే చరణ్ మళ్ళీ చిత్రీకరణలో పాల్గొననున్నాడు. దీని తరువాత ఆచార్యతో కలిసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం కొరటాల శివ కూడా చరణ్ సన్నివేశాలను ఒకే షెడ్యూల్ చేసేందుకు చూస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్ ముందుగా ఆచార్యను పూర్తి చేసుకొన్న తరువాత ఆర్ఆర్ఆర్‌తో రీజాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఆచార్య హైదరాబాద్ చుట్టుపక్కల ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అతి కొద్ది రోజులలోనే హీరోయిన్ కాజల్ కిచ్లూ షూటింగ్‌లో పాల్గొననుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts