telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచే కీలకం…

Anil kumble cricketer

టీం ఇండియా ఆసీస్ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు సిరీస్ లలో వన్డే సిరీస్ ను ఆసీస్ టీ 20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్నాయి. కానీ ఆస్ట్రేలియాతో జరగనున్న 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు విజయం సాధించాలంటే డిసెంబర్ 17న అడిలైడ్‌లో జరిగే తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం అని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే తెలిపాడు. అయితే ఈ టూర్ లో భారత్-ఆసీస్ మూడు ఫార్మటు ల సిరీస్ లో పాల్గొననున్న అందరి దృష్టి మాత్రం టెస్ట్ సిరీస్ పైనే ఉంది. అయితే ఈ పొడుగు ఫార్మాట్ యొక్క సిరీస్ పై కుంబ్లే మాట్లాడుతూ… మొదటి టెస్ట్ లో విజయం సాధిస్తేనే భారత జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ బలంగానే ఉంది. కానీ ఈసారి ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ చేరడం అలాగే మొదటి టెస్ట్ తర్వాత కోహ్లీ దూరం అవ్వడం భారత్ కు వ్యతిరేక అంశాలు అని కుంబ్లే తెలిపాడు. మొదటి టెస్ట్ లో ఓడితే కోహ్లీ లేని మిగిత మూడు మ్యాచ్ లలో విజయం సాధించడం టీం ఇండియా కు చాలా కష్టం అవుతుంది అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. చూడాలి మరి మనోళ్లు ఏం చేస్తారు అనేది.

Related posts