telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ జయంతి : చంద్రబాబు నివాళులు

ఎన్టీఆర్ జయంతి సందర్బంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితం.. భావి తరాలకు దిక్సూచి అని పేర్కొన్నారు. దేవుడిని ఎన్టీఆర్ లో చూసుకున్న రోజులున్నాయని.. దేవుడి పాత్రలలో ఎన్టీఆర్ జీవించాడని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కానీ పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారని చంద్రబాబు అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు రాజీపడకుండా తెలుగు జాతి వారసత్వ సంపద, రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శం అన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అవసరమైన పథకాలు రూపొందించారని చెప్పారు. రెసిడెన్సియల్ స్కూళ్ళు తదితర ఎన్నో పథకాలను దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ , దేవాన్ష్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Related posts