హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కుర్సింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మూసాపేట్, ఉప్పల్, రామాంతాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో జల్లులు కురిసాయి. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
నగరంలోని ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు పడుతుండడంతో అనేకమంది అంటువ్యాధుల బారీనపడి మంచం పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, డయేరియాతో పాటు సాధారణ జ్వరాలు, తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్